What is Digital Marketing(డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?):పరుగులు తీస్తూన్న ప్రపంచ టెక్నాలజీ ని మన అర చేతిలో చిన్న స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నాము. చిన్న పిల్లాడి నుండి ముసలి వాళ్ళ వరుకు ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్ ని ఉపయోగిస్తున్నాం. ఇలా ఇంటర్నెట్ ని వాడే తరుణం లో బయట చేసే మార్కెటింగ్ ని ఇంటర్నెట్ ద్వారా చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి , తమ కంపెనీల బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలనుకునే వాళ్లకి ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్రేడిషనల్ మార్కెటింగ్ కి పూర్తి విభిన్నం. ఇంతకు ముందు టీవీ , రేడియోలలో యాడ్స్ ఇచ్చేవారు. ఇవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. కానీ ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా యాడ్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మనం ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో వాళ్లకి మాత్రమే మన సమాచారం చేరేలా సహాయపడుతుంది. తక్కువ టైములో ఎక్కువ మంది కస్టమర్స్ ని రీచ్ అయ్యేలా చేసేదే డిజిటల్ మార్కెటింగ్.